Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs

యేసునామ ధారులందరు – ఎంతో ధన్యులు | Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs | Bible Mission Songs | M Devadas Ayyagaru

Yesu Naama Darulandaru Entho Danyulu

యేసునామ ధారులందరు – ఎంతో ధన్యులు వారు – భాసురమైనట్టి స్థితిలో – బ్రతుక జూతురు
|| యేసునామ ||

ఆదాము హవ్వల వలెనె – ఐక్య మొందుదురు
వారు బేధమేమియు లేకుండగనె – పెరుగు చుందురు
|| యేసునామ ||

హేబేలు వలెనె ప్రభువునకు మంచివి – ఇచ్చి వేతురు
వారు – ఆ బాలుని వలెనె దేవుని – అనుమతి పొందుదురు
|| యేసునామ ||

హనోకు వలెనె దేవుని – హత్తి యుందురు
వారు – ఏనాడో ఒకనాడు పైకి – ఎగిరి పోదురు
|| యేసునామ ||

నోవాహు వలెనె క్రీస్తుని – నావను జేరుదురు
వారు – ఏవిధమైన ప్రళయంబును – ఎరుగకుందురు
|| యేసునామ ||

షేమువలె దేవుని గలిగి – సిద్ధులౌదురు
వారు – తాము తలంచు దేవునికి వందనము చేయుదురు
|| యేసునామ ||

అబ్రామువలెనె పిలుపు – అందుకొందురు
వారు – శుభ్రముగా యిలువిడిచి వేరు – చోటున చేరుదురు
|| యేసునామ ||

ఇస్సాకు వలెనె చావు – నెదురుకొందురు
వారు – డస్సిపోరు వెనుకాడరు – దాగి యుండరు
|| యేసునామ ||

యాకోబువలె దీవెనలెన్నో – ఆర్జింప గలరు
వారు -త్రైకునితో పోరాడి పగను – దించి వేయుదురు
|| యేసునామ ||

యూదా వలెనె పరుల కొరకు – వాదింప గలరు
వారు – వేదన గలవారికై క్రీస్తుని – వేడు కొనగలరు
|| యేసునామ ||

యోసేపు వలెనె శోధన – లున్న గెలుతురు
వారు – ఏ సమయ మందైన – మంచి ఏలిక లౌదురు
|| యేసునామ ||

మోషే వలెనె దేవుని ముఖా – ముఖిగా జూతురు
వారు – మోషే వలెనె విద్యకు – ప్రామ్ముఖ్యు లౌదురు
|| యేసునామ ||

యెహోషువ వలె వాగ్దేశ – మేగుదురు త్వరలో
వారు – మహా శూరులై వైరి యడ్డు – మడ ద్రొక్కుదురు
|| యేసునామ ||

న్యాయాధిపతుల వలెనె – న్యాయము తీర్తురు
వారు – ఆయా ఆపదలందు ప్రజల – నాదరింతురు
|| యేసునామ ||

రూతు వలెనె పాతక జనులు – జాతిని విడుతురు
వారు – నీతి సభలో జేరి క్రీస్తు – నియమితు లౌదురు
|| యేసునామ ||

సమూయేలు వలె ప్రార్ధన సమా – జములు పెట్టుదురు
వారు – క్రమ పరతురు జన సంఘములో – కలహము లేకుండ
|| యేసునామ ||

రాజుల వలెనె నేటి దేవ – రాజ్యాసీనులు
వారు – రాజులు యాజకులు శాంతి – రాజ్య ప్రచారకులు
|| యేసునామ ||

నెహెమ్యా వలెనె పడిపోయినవి – నిలువ బెట్టుదురు
వారు – నెమ్యా వలెనె ప్రజలను దిద్ది – నేర్పుదురు బుద్ది
|| యేసునామ ||

ఎజ్రా వలెనె మరచిన బోధ – ఎరిగింప గలరు
వారు – ఎజ్రా వలెనె శాస్త్రము నందు- ఎదిగింప గలరు
|| యేసునామ ||

ఎస్తేరు వలె స్వంత వారి – స్వస్థి కోరుదురు
వారు – ఎస్తేరుతో అత్యాదులు – ఎత్తి వేయుదురు
|| యేసునామ ||

యోబు వలెనె కష్టా లెల్ల – ఓర్చు కొందురు
వారు – ఏ బాధయందైన దేవుని – హెచ్చుగ జూతురు
|| యేసునామ ||

దావీదు వలెనె దేవుని – సేవకు లౌదురు
వారు – పావన కీర్తనల కవులై – ప్రబలు చుందురు
|| యేసునామ ||

సొలోమోను వలె జ్ఞానంబు – కలిగి యుందురు
వారు – కలిమి గలిగి క్రొత్త పనులు – కల్పన చేయుదురు
|| యేసునామ ||

ముగ్గురు బాలుర వలెనే మండు – అగ్గికి జడియరు
వారు – అగ్గిని కాల్చి అగ్గినుండి – దిగ్గున లేతురు
|| యేసునామ ||

దానియేలు వలెనే శ్రమలో – ధైర్యవంతులు
వారు – ఆ నిమిషమందే ప్రార్ధన – అధికము జేతురు
|| యేసునామ ||

ప్రవక్తల వలెనె దేవ – వాక్కు చెప్పుదురు
వారు – ప్రవచనముల అర్ధములెల్ల – వివరింప గలరు
|| యేసునామ ||

మరియంబ వలెనె – క్రీస్తుని – ధరియింప గలరు
వారు – పరిశుద్ధ వార్త హృదయమున – భద్ర పరతురు
|| యేసునామ ||

పేతురు వలెనె స్వజనులకు – 1ప్రేషితు లౌదురు
వారు – రాతి పునాదులౌదురు – నూతన సభలందు
|| యేసునామ ||

పౌలు వలెనె పరజనులు సు – వార్తికులౌదురు
వారు – పౌలు వలెనె సిలువను నొక్కి – ప్రజలకు జూపుదురు
|| యేసునామ ||

స్తెఫను వలె ఎదురాడని – తెలివిని చూపుదురు
వారు – అపరాదులు కాకున్నను హత – సాక్షులౌదురు
|| యేసునామ ||

యోహాను వలె మూడు లోకా – లుండుట జూతురు
వారు – యోహాను వలె మూడు కాలా – లుండుట జూతురు
|| యేసునామ ||

యేసు వలె అద్భుతాలు – చేసి చూపుదురు
వారు – దాసులగుట చేత రక్షణ – దారి చూపుదురు
|| యేసునామ ||

క్రీస్తువలె నడువ గలుగు – క్రియలు చేయుదురు
వారు – వాస్తవ మైనవన్ని ఋజువు – పరుప నేర్తురు
|| యేసునామ ||

Youtube Video

Yesu Naama Darulandaru Entho Danyulu

Yesu Naama Darulandaru Entho Danyulu

Song Credits

More Songs

Yesu Naama Darulandaru Entho Danyulu

Sarvaloka Prabhuvunaku Song Lyrics | Bible Mission Songs | Old Is Gold

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top