బేత్లెహేము పురము నందు కన్య మరియ | Lokalanele Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sharon Sisters
Table of Contents
Lokalanele Rakshakudu Song Lyrics
బేత్లెహేము పురము నందు కన్య మరియ
గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము – ఆరాధింతుము …
లోకాలనేలే రారాజును
ప్రకటింతుము – లోకమంతయు …
పాపము బాపే మన యేసుని
క్రీస్తు పుట్టెను – తార వెలిసెను –
చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము – పరమానందము
కలిగించు వార్త – దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను
యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
ఉల్లసింతుము !!(2)
నడిచివెళ్లిరి – జ్ఞానులందరు –
తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో
ఆరాధించిరి -బోళముతో –
మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను
లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను.
ఉల్లసింతుము !!(2)
ఉల్లసింతుము – ఆరాధింతుము …
లోకాలనేలే రారాజును
ప్రకటింతుము – లోకమంతయు …
పాపము బాపే మన యేసుని
Youtube Video
More Songs
Rakshakundu Puttadu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Nissy Paul | Paul Emmanuel