సిలువే నా శరణాయెను రా | Siluve Naa Sharanaayenu Raa Song Lyrics | Good Friday Song 90s

Table of Contents
Siluve Naa Sharanaayenu Raa Song Lyrics
సిలువే నా శరణాయెను రా
నీ సిలువే నా శర ణాయెను రా
సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా
||నీ సిలువే||
సిలువను వ్రాలి యేసు పలికిన
పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా
||నీ సిలువే||
సిలువను జూచుకొలఁది
శిలసమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
||నీ సిలువే||
సిలువను దరచి తరచితి
విలువ కందఁగ రాని నీ కృప
కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా
||నీ సిలువే||
పలు విధ పథము లరసి
ఫలిత మేమి గానలేక
సిలువయెదుటను నిలచినాఁడను రా
||నీ సిలువే||
శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా
||నీ సిలువే||
Youtube Video

More Songs
