దైవాత్మ రమ్ము – నా తనువున వ్రాలుము || Daivathma Rammu Song Lyrics || Bible Mission || Old Songs || M.DevaDas || Telugu Kristava Keerthanalu || Andhra Kraistava Keerthanalu
Table of Contents
Daivathma Rammu Song Lyrics Telugu
దైవాత్మ రమ్ము – నా తనువున వ్రాలుము –
నా = జీవమంతయు నీతో నిండ –
జేరి వసింపుము || దైవాత్మ ||
స్వంత బుద్ధితోను – యేసు ప్రభుని నెరుగలేను –
నే = నెంతగ నాలోచించిన విభుని – నెఱిగి చూడ లేను
|| దైవాత్మ ||
స్వంత శక్తితోను – యేసు – స్వామి జేరలేను –
నే = నెంత నడచిన ప్రభుని కలిసికొని – చెంత జేరలేను
|| దైవాత్మ ||
పాప స్థలము నుండి – నీ సువార్త కడకు నన్ను – భువి –
నో = పరమాత్మ నడుపుచుండుము – ఉత్తమ స్థలమునకు
|| దైవాత్మ ||
పాపములో మరల – నన్ను పడకుండగ జేసి –
ఆ = నీ పరిశుద్ధమైన రెక్కల – నీడను కాపాడు
|| దైవాత్మ ||
పరిశుద్ధుని జేసి – నీ వరములు దయచేసి –
నీ = పరిశుద్ధ సన్నిధిని జూపుమ – పావురమా వినుమా
|| దైవాత్మ ||
తెలివిని గలిగించు – నన్ను దివ్వెగ వెలిగించు –
నీ = కలిగిన భాగ్యము లన్నిటిని నా – కంటికి జూపించు
|| దైవాత్మ ||
నన్నును భక్తులను – యే నాడును కృపతోను –
నిల = మన్నించుము మా పాప రాసులను – మాపివేయు దేవా
|| దైవాత్మ ||
వందనములు నీకు – శుభ – వందనములు నీకు –
ఆ = నందముతో కూడిన నా హృదయ వందనములు నీకు
|| దైవాత్మ ||
Daivathma Rammu Song Lyrics English
daivaatma rammu – naa tanuvuna vraalumu –
naa = jeevamaMtayu neetO niMDa –
jaeri vasiMpumu || daivaatma ||
svaMta buddhitOnu – yaesu prabhuni nerugalaenu –
nae = neMtaga naalOchiMchina vibhuni –
ne~rigi chooDa laenu
|| daivaatma ||
svaMta SaktitOnu – yaesu – svaami jaeralaenu –
nae = neMta naDachina prabhuni kalisikoni –
cheMta jaeralaenu
|| daivaatma ||
paapa sthalamu nuMDi – nee suvaarta kaDaku nannu –
bhuvi – nO = paramaatma naDupuchuMDumu –
uttama sthalamunaku
|| daivaatma ||
paapamulO marala – nannu paDakuMDaga jaesi –
aa = nee pariSuddhamaina rekkala –
neeDanu kaapaaDu
|| daivaatma ||
pariSuddhuni jaesi – nee varamulu dayachaesi –
nee = pariSuddha sannidhini joopuma –
paavuramaa vinumaa
|| daivaatma ||
telivini galigiMchu – nannu divvega veligiMchu –
nee = kaligina bhaagyamu lanniTini naa –
kaMTiki joopiMchu
|| daivaatma ||
nannunu bhaktulanu – yae naaDunu kRpatOnu –
nila = manniMchumu maa paapa raasulanu –
maapivaeyu daevaa
|| daivaatma ||
vaMdanamulu neeku – Subha – vaMdanamulu neeku –
aa = naMdamutO kooDina naa hRdaya
vaMdanamulu neeku
|| daivaatma |
Pingback: Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs - Ambassador Of Christ