Ganuda Gunasekaruda Song Lyrics | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024

ఘనుడా గుణశేఖరుడా నా యేసురాజా | Ganuda Gunasekaruda Song Lyrics | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024

Ganuda Gunasekaruda Song Lyrics

Ganuda Gunasekaruda Song Lyrics

ఘనుడా గుణశేఖరుడా నా యేసురాజా
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా (2)
పాపిని కరుణించితిని పరివర్తన కలిగించితివి
అనురాగ క్షేత్రమందు హరింపచేసితివి (2)
|| ఘనుడా ||

శుభ వాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా
సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా (2)
మాట తప్పని మహనీయుడవు నీవు
ధారాళముగా దయచేసే మహాదాతవు (2)
|| ఘనుడా ||

సత్య ప్రమాణాలెన్నో చేసిన సర్వశక్తుడా
సద్విషయాలెన్నో నేర్పిన సత్ బోధకుడా (2)
సర్వ సత్యములో నడిపించే దేవుడవు
కృపా సత్యములు మాకై తెచ్చిన కృపాపూర్ణుడా (2)
|| ఘనుడా ||

శుభ ఉద్దేశముతో కార్యసిద్ధి కలిగించితివి
పరిపూర్ణునిగా నిలుపుటకై క్రియాశక్తినిచ్చితివి (2)
మహిమ రాజ్యమునకు నను నడిపే మార్గదర్శకా
అమరత్వమును నాలో నింపే అమరనాథుడా (2)
|| ఘనుడా ||

Youtube Video

More Songs

Viswanadhuda Song Lyrics || Prema Poornudaa Snehaseeluda Song Lyrics || hosannaministries 2024 New Year Song || Telugu Christian Songs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top