హృదయమంతా | Hrudayamanthaa Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Asha Ashirwadh

Table of Contents
Hrudayamanthaa Song Lyrics
పల్లవి:
హృదయమంతా పాప భారమే –
వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే –
చేరువాయే చెడు స్నేహమే
ప్రభువా.. నన్ను కరుణించు
క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు
నీ పనిలో నడిపించు (2)
చరణం:
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను ( 2)
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని (2)
-లేవలేక నేను నిను చేరితి (2)
“ప్రభువా “
చరణం:
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే (2)
తిరిగొచ్చిన కుమారుడనైతిని (2)
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా….
Youtube Video

More Songs
