కల్వరి నాథా నిన్ను చూడాలి | Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

Table of Contents
Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics
కల్వరి నాథా నిన్ను చూడాలి
నా యేసు దేవా నిన్ను చేరాలి
నీ రక్త ధారలే నను కడగాలి
నీదు సాక్షిగా నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలతో – ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా – గానమాలపించాలి
నీ స్వస్థత కావాలి – నీదు మాటలు వినాలి
నా జీవిత కాలమంతా – నీ గానము చేయాలి
నీ రెక్కల చాటున – నేను దాగియుండాలి
నా ప్రాణ నాథుడా ని – స్తోత్ర గీతి పాడాలి
నీదు అడుగుజాడలయందు – నేను సాగిపోవాలి
నీ జల్దరు నీడలోన – నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా – నీవే రారాజువనుచు
నీ దివ్య సన్నిధి చేరి – నవ్య గీతం పాడాలి
నీ నామము ఎరుగని వారి-కొడుకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త – లోకమంతా చాటాలి
నీ సిలువ శాంతి లో – నీ కరుణ కాంతిలో నీ
నా జీవిత కాలమంతా – నేను సాగిపోవాలి
కల్వరి నాథా నిన్ను చూడాలి
నా యేసు దేవా నిన్ను చేరాలి
నీ రక్త ధారలే నను కడగాలి
నీదు సాక్షిగా నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలతో – ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా – గానమాలపించాలి
Youtube Video

More Songs
