కన్నీళ్లే కీర్తనలాయే | Kannile Keerthanalaaye Song Lyrics | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026
Table of Contents
Kannile Keerthanalaaye Song Lyrics
పల్లవి :-
కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే…
కాచినావు కాపాడేదవు, మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత “2”
ఎలా తీర్చగలను నీ ఋణమును”2″
“కన్నీళ్లే “
చరణం-1
అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి..
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి “2”
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి “2”
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు “2”
” కన్నీళ్లే “
చరణం -2
నే చూడని యుద్దాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి “2”
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి “2”
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది “2”
” కన్నీళ్లే “
చరణం -3
వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే “2”
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే “2”
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు “2”
” కన్నీళ్లే “
చరణం -4
మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే “2”
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే “2”
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు “2”
“కన్నీళ్లే “
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.