యేసు నిన్ను నే స్తుతియించుట | Maananu Maananu Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Joel Kodali

Table of Contents
Maananu Maananu Song Lyrics
యేసు నిన్ను నే స్తుతియించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను
ప్రతికూల పరిస్థితులు
వెంటాడు ఘడియలలో
నీ సిలువ తట్టు తిరిగి
నీ యాగమును తలచి
సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి
నాకింక నిన్ను స్తుతియించకుండా
ఉండు కారణమేది లేకపోయెను
నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
నా పాప రోగము కడిగితివి
ఈనాడు నీవు నా దేహరోగము
స్వస్థపరచినా లేకున్నా
పరమందు ధనవంతుడు నే నగుటకు
దారిద్యములో నీవు జీవించితివి
ఈ లోక ధనము నను విడచి పోయి
దరిద్రునిగా నే మిగిలినను
అసాధ్యుడవు నీవు సర్వాధికారివి
సార్వభౌముడవు దయాలుడవు
నా జీవితములో నా మేలుకోరకే
సమస్తమును జరిగించు వాడవు
Youtube Video

More Songs
Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER
