మారని దేవుడవు నీవే యేసయ్యా | Maarani Dhevudavu Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Maarani Dhevudavu Song Lyrics
మారని దేవుడవు నీవే యేసయ్యా
నిరతము నాతోడు ఉన్నావయ్యా(2)
నిబందనలెన్నో నాతో చేసితివి
నూతన కృపతో నింపితివి(2)
అర్పింతును నా స్తుతి దీపిక
అందుకో నవరాగ గీతిక(2)
( మారని దేవుడవు )
నా భారమంతయు భరియించితివి
కృపా ఐశ్వర్యముతో అవసరాలు తీర్చితివి(2)
సమృద్ధి శీలుడా సౌశీల్యవంతుడా
నీ కృపా బహుళ్యముతో నన్ను దీవించితివి(2)
( అర్పింతును నా స్తుతి )
నా క్షేమము కోరి నా గూడు రేపితివి
పక్షిరాజువలెను రెక్కలపై మోసితివి(2)
ప్రగతి శీలుడా ప్రణాళిక నాథుడా
నీ కృపా దాతృత్వముతో నన్ను స్తిరపరచితివి(2)
( అర్పింతును నా స్తుతి )
నీ వదనము చూచి తృప్తి చెందితిని
నా సదనము నీవై క్షేమమునిచ్చితివి(2)
ఆనంద నిలయుడా సంక్షేమానాథుడా
నీ రాజ సౌధములో సౌగాంధమిచ్చితివి (2)
( అర్పింతును నా స్తుతి )
మారని దేవుడవు నీవే యేసయ్యా
నిరతము నాతోడు ఉన్నావయ్యా(2)
నిబందనలెన్నో నాతో చేసితివి
నూతన కృపతో నింపితివి(2)
అర్పింతును నా స్తుతి దీపిక
అందుకో నవరాగ గీతిక(2)