మహా రాజువే మా నాయకుడవే | Maharaajuve Maa Naayakudave Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Maharaajuve Maa Naayakudave Song Lyrics
మహా రాజువే మా నాయకుడవే
నడిపించు నా దైవమే
ప్రతీ స్థలమునా జతే చేరినా
ప్రియమైన నా హితుడవే (2)
ప్రతి స్థితిలోన నడిపిన వైనం
ఆశ్చర్యమే కలిగించే ప్రతీ క్షణం (2)
ఆరాధింతును అను నిత్యము
నిను కొనియాడెదను నిరతము (2)
శత్రు భయముతో మది అలజడితో –
మార్గమే కానక నిలచిన వారికి (2)
చెదరిన గుండెకు బలమివ్వగా
నిలిపితివి సంద్రము జలరాశిగా
విస్మయ మొందెను వెనుతిరుగగా
మరణించే శత్రువు కనిపించక
స్తుతియుంచుచూ సాగేనాపయనము –
చేర్చితివి క్షేమముగా ఆ గమ్యము (2)
|| ఆరాధింతును ||
మంటిని కూర్చి పాత్రగ మలచి –
నీ పోలికనిచ్చి మహిమగ తీర్చి (2)
నిలిపితివి నన్ను నీవానిగా
ఆత్మల రక్షణకై ఒక ప్రమిదగా
సాగెదను నేను నీ సాక్షిగా
నీ స్వరము నాలో ధ్వనియించగ
ఇదే నాకు నిజమైన నిరీక్షణ –
నీ కౌగిలిలో నాకు సంరక్షణ (2)
|| ఆరాధింతును ||
మరణము గెలచిన మృత్యుంజయుడవు –
మహిమతో దిగివచ్చు నా మహరాజువు (2)
నీ మహిమ రాజ్యములో నిలవాలని
జయించినవారితో గడపాలని
ఈ వాంఛ తీరగ తెరువేదని
అక్షయుడా చేరితి నీ శరణని
వర్ణింపలేనయ్య నా భాగ్యము –
కడవరకు కృపలోనే నా పయనము (2)
|| ఆరాధింతును ||
Youtube Video
More Songs
Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025