నీదు సేవలో సాగిపోవుట | Needhu Sevalo Sagipovuta Song Lyrics | Pastor Praveen | A.R.Stevenson | Latest Telugu Christian Songs 2024

Table of Contents
Needhu Sevalo Sagipovuta Song Lyrics
నీదు సేవలో సాగిపోవుట
నేను కలిగియున్న ఆశ యేసయ్య
నిన్ను పోలి ఉండాలని
నీ సువార్త చాటాలని
నా కోరిక అదే చాలిక
అ.ప. :
మంటివానికా ఈ గొప్ప ధన్యత
ఆత్మల రక్షించు బాధ్యత
నిన్నుబట్టి ఎచట కాలు మోపినా
ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా
నావైపు చూచువారికి నీవు కనబడాలి
నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
చేతులెత్తి ఎపుడు మోకరించినా
అద్భుతాలు మెండుగ జరగాలయ్యా
నా మాట విన్న వారికి నెమ్మది కలగాలి
నీవే మహిమ పొందుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
దుష్టులెంత చెరుపు చేయచూసినా
వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా
నా ప్రాపు కోరువారికి కష్టము తొలగాలి
హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Youtube Video

More songs
Oohakandhanantha Unnatham Song Lyrics | Akshaya Praveen |Telugu Christian Song | A.R.Stevenson
