నేనును నా ఇంటివారును | Nenunu Naa Intivaarunu Song Lyrics | Krupanandhu Olesu | Latest New Telugu Christian Songs 2024
Table of Contents
Nenunu Naa Intivaarunu Song Lyrics
పల్లవి:
నేనును నా ఇంటివారును యెహోవానే సేవింతుము
మేము ఏకముగా కూడి యేసునే వెంబడింతుము -2
ప్రభు సన్నిధిలో ఆనందింతుము – కల్వరి ప్రేమను ధ్యానింతుము – 2
శత్రువులు మమ్ము తరిమినా – లోకము మమ్ము ద్వేషించినా – 2
దేనికి భయపడము క్రీస్తు మనస్సు కలిగియుందుము – 2
|| నేనునూ||
చరణం: 1
మా బలము మా జ్ఞానము మా నీతి ఆయనే
మా జీవము మా సర్వము మా ఖ్యాతి ఆయనే – 2
నిత్యము బలపరచు యేసునందే అతిశయీంతుము – 2
ఏ కీడు దరిచేరకుండా మమ్ము భద్రపరచును – 2
|| నేనును||
చరణం: 2
పరిశుద్ధుడు పరమాత్ముడు సృష్టికర్త ఆయనే
నీతిమంతుడు సత్యవంతుడూ రక్షకుడు ఆయనే -2
లోకమును ఎంతో ప్రేమించిన కనికర సంపన్నుడు -2
నిత్య జీవమునిచ్చే జీవాధిపతి ఆయనే – 2
|| నేనును||