ఊహకే అందనిది నీ మధుర ప్రేమ | Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026
Table of Contents
Oohake Andanidi Song Lyrics
ఊహకే అందనిది నీ మధుర ప్రేమ
ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2)
నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు
నీ హృదయానుసారునిగా
బ్రతికించుము యేసయ్యా (2)
నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం..
నీవే నా సర్వం నా యేసయ్యా (2)
పలువురు నన్ను పరిహాసమాడినా
ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2)
నా ప్రగతిని నీవు కోరుకున్నావు
పరిహాసములన్నిటిని నా కీర్తిగా మలిచావు (2)
ప్రభువా నాకై ప్రణాళిక చేసితివి
ఈ లోకములో నుండి ప్రత్యేక పరచితివి (2)
నా క్షేమము నీవు కోరుకున్నావు
ఇహమందు పరమందు నా స్వాస్థ్యమైనావు (2)
అర్హత లేని నను కోరుకున్నావు
నా శేష జీవితం నీకే అంకితం (2)
నా సర్వము నీకే అర్పించెద యేసయ్యా
ఏమున్నా లేకున్నా నీవుంటే చాలయ్యా (2)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join in our WhatsApp Channel to participate in telugu Bible quiz And win Spiritual gifts and Prizes