పచ్చ పచ్చాని బెత్లేము లో | Pacha pachaani Bethlemu Song Lyrics | Latest Telugu Christmas Song 2024

Table of Contents
Pacha pachaani Bethlemu Song Lyrics
పల్లవి:
పచ్చ పచ్చాని బెత్లేము లో..
చల్ల చల్లాని నడిరేయి లో..
వెచ్చ వెచ్చంగ అమ్మ ఒడిలో…
రాజాధిరాజు పవళించెనూ..
జగతిని బ్రోవగా..
జనులను కావగా..
దైవ కుమారుడే
ఇల జనియించెగా..
చరణం1 :
మదిలో..మరియను
విడ నాడగా..
తలచెను యోసేపు తనలో..
కలలో..దూత పలుకులు వినగా..
పరిణయమాడెను ఆ కన్యనూ..
పరిశుద్ధాత్మే తాకగా..
మరియా గర్భము పండగా..
మహిమాన్వితుడే క్రీస్తుగా
మహిలో అవతరించగా..
పరమున దూతాళి స్తోత్ర గీతి పాడగా..
గొర్రెలు గంతులేయుచుండ
గొల్లలు నాట్యమాడుచుండ
వడివడిగా ఒంటెలు కదలిరాగా..
జ్ఞానులు కాన్కలర్పించిరీ
చరణం 2
భువిలో నరులను కరుణించగా..
దివినే విడచిన మా ప్రభువా..
జీవం..నిత్యం మాకివ్వగా
ప్రాణం అర్పించిన ఘనుడా..
తూరుపు చుక్కే వెలుగు గా
పశువుల పాకే నీడగా..
పాపుల క్షమయే బాసగ..
మోక్షపు మార్గం చూపగ …
Youtube Video

More Songs

Pingback: Rakshakundu Puttadu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Nissy Paul | Paul Emmanuel - Ambassador Of Christ