షారోను మైదానముతో | Sharonu Maidhanamutho Song Lyrics | Bible Mission Nellore |Bible Mission Songs With Lyrics
Table of Contents
Sharonu Maidhanamutho Song Lyrics
షారోను మైదానముతో – సమమైన మైదానంబు = ఏ రాజ్య మందు లేదు – ఎంచిచూడగా
ప్రభూయేసురూపే సంఘ – వధువు ధరియించె నామె = విభవ మేమంచు నేను-వివరింపగలను
||షారోను||
స్వీయరక్తమున ప్రభువు – చిన్ని కన్నియను శుద్ధి – జేయ పావురము వంటి – దాయె స్థిరముగను
||షారోను||
నిష్పక్ష పాతముతోడ – నిజము చెప్పవలెనన్న = పుష్పవన మిదియెకటియే – పూర్ణార్దంబున
||షారోను||
పరమార్ధ కీర్తనంబు – పాడించినదియె యీ = సరసమైన పుష్పాల షారోను పొలము
||షారోను||
షారోను పుష్పమువంటి – సంఘవధువునకు క్రీస్తు = ఏరూప మిచ్చెనో నే – నెన్నగలనా
||షారోను||
నానా వర్ణాల పువ్వుల్ – నర దృష్టి నాకర్షించు = మానవ శుద్ధి ప్రభుని – మదినాకర్షించు
||షారోను||
సర్వ పుష్పాలయందు – సంఘ వధువె పుష్పంబు = ఊర్విని సిద్ధమౌను – ఉండు పరమందు
||షారోను||
సూర్యుండు పువ్వులకెంతో – సొగసైన రంగులద్దున్ = సూర్యుండై నట్టియేసు – శుభగుణము లద్దున్
||షారోను||
ఆ యద్దకంబు వాడి – అంతర్ధానంబై పోవు = ఈ యద్దకంబు పోదు ఇది శాశ్వతముండు
||షారోను||
వివిధ వర్ణములు గల – విశ్వాసులను పుష్పాలు = భువి మీద మొల్చునట్టి – పుష్ప సంఘంబు
||షారోను||
సభను గురించియునా – ప్రభుని గురించియున్న = శుభవార్త వినుచు చెప్పుచు – సుఖియింపగలను
||షారోను||
Sharonu Maidhanamutho Song Lyrics English
shaarOnu maidaanamutO – samamaina maidaanaMbu = ae raajya maMdu laedu – eMchichooDagaa
prabhooyaesuroopae saMgha – vadhuvu dhariyiMche naame = vibhava maemaMchu naenu-vivariMpagalanu
||shaarOnu||
sveeyaraktamuna prabhuvu – chinni kanniyanu Suddhi – jaeya paavuramu vaMTi – daaye sthiramuganu
||shaarOnu||
nishpaksha paatamutODa – nijamu cheppavalenanna = pushpavana midiyekaTiyae – poorNaardaMbuna
||shaarOnu||
paramaardha keertanaMbu – paaDiMchinadiye yee = sarasamaina pushpaala shaarOnu polamu
||shaarOnu||
shaarOnu pushpamuvaMTi – saMghavadhuvunaku kreestu = aeroopa michchenO nae – nennagalanaa
||shaarOnu||
naanaa varNaala puvvul^ – nara dRshTi naakarshiMchu = maanava Suddhi prabhuni – madinaakarshiMchu
||shaarOnu||
sarva pushpaalayaMdu – saMgha vadhuve pushpaMbu = oorvini siddhamaunu – uMDu paramaMdu
||shaarOnu||
sooryuMDu puvvulakeMtO – sogasaina raMguladdun^ = sooryuMDai naTTiyaesu – SubhaguNamu laddun^
||shaarOnu||
aa yaddakaMbu vaaDi – aMtardhaanaMbai pOvu = ee yaddakaMbu pOdu idi SaaSvatamuMDu
||shaarOnu||
vividha varNamulu gala – viSvaasulanu pushpaalu = bhuvi meeda molchunaTTi – pushpa saMghaMbu
||shaarOnu||
sabhanu guriMchiyunaa – prabhuni guriMchiyunna = Subhavaarta vinuchu cheppuchu – sukhiyiMpagalanu
||shaarOnu||