సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో | Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s

Table of Contents
Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ (2)
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2)
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
Youtube Video

More Songs
