సువార్తే పరిష్కారం | Suvarthe Parishkaram Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Suresh Vanguri | John Pradeep

Table of Contents
Suvarthe Parishkaram Song Lyrics
అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె ||ఇకనైనా లేవరా||
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా లేవరా||
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా లేవరా||
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా లేవరా||
Youtube Video

More Songs
