Vivaham Devuni Nirnayam Song Lyrics | Vaibhavame Song Lyrics | Latest Christian Wedding Song 2025 | Samy Pachigalla

వివాహం దేవుని నిర్ణయం | Vivaham Devuni Nirnayam Song Lyrics | Vaibhavame Song Lyrics | Latest Christian Wedding Song 2025 | Samy Pachigalla

Vivaham Devuni Nirnayam Song Lyrics

వివాహం దేవుని నిర్ణయం
ఈ వివాహం దేవ దేవుని సంకల్పం
వైభవం అతి ఘనం అతిశయమాద్భుతం అద్భుతం
ఈ పరిణయం ఎంతో అతిఘనమే “2”

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు
ఏకంచేసే ఈ శుభతరుణం “2”
అమృతమైన ఈ ప్రేమ పరిణయం
స్థిరపరిచేను దేవుడు ఈ రోజు “2”
వైభవమే ఎంతో ఘనమే “2”

వేసే ప్రతి అడుగు దేవుని చితములోనే
జీవితకాలం సాగాలని కలలే కన్నాము “2”
హృదయవాంఛలు ఎరిగిన దేవుడు
జతపరచెను మమ్మును ఒకటిగా “2”
స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు
స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు
వైభవమే ఎంతో ఘనమే “2”

దేవుని దయలో మేము ఎదగాలని
ఆయనకే మహిమకరముగా నడవాలని
నిత్యము కలిసి మేము వెలగాలని
ఆయనకే మహిమకరముగా నడవాలని
సంతోష సౌభాగ్యాలతో
దీవించెను దైవం ఈరోజు “2”
స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు
స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు
ఏకం చేసే ఈ శుభ తరుణం “2”
అమృతమైన ఈ ప్రేమ పరిణయం
స్థిరపరిచేను దేవుడు ఈ రోజు “2”
వైభవమే ఎంతో ఘనమే “2”

Youtube Video

Vivaham Devuni Nirnayam Song Lyrics

More Songs

Nee Krupathishayamu Song Lyrics | Nee Krupathisayamunu Song lyrics | Dr. Asher Andrew | Latest Telugu Christian Song 2025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top