Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu

యేసుక్రీస్తు వారి కథవినుడి || Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu

Yesu Kristhu Vaari Kada Song Lyrics

Yesu Kristhu Vaari Kada Song Lyrics

యేసుక్రీస్తు వారి కథవినుడి – దేశీయులారా – యేసు క్రీస్తువారి
కథవినుడి = దోసకారులన్ రక్షింప – దోసములంటని రీతిగనె
దాసుని రూపంబుతో మన – ధరణిలో వెలసిన దేవుండౌ
|| యేసుక్రీస్తు ||

రోగులన్ కొందరినిజూచి – బాగుచేయునని యనలేదు – రోగముల
తీరది పరికించి – బాగుచేయ లేననలేదు – రోగముల నివారణకైన –
యోగముల్ తాజెప్పలేదు – యోగయోగులమించు వైద్య – యోగి
తానని ఋజువుగొన్న
|| యేసుక్రీస్తు ||

పాపులను నిందించి యేవిధ – శాపవాక్కుల్ పల్కలేదు – పాపులకు
గతిలేదని చెప్పి – పారద్రోలి వేయలేదు కోపపడుచు పాపులను
రా – కూడదని వచియింపలేదు = పాపములు పరిహారము చేసి –
పరమదేవుడు తానని తెల్పిన
|| యేసుక్రీస్తు ||

నరులకు దేవుడు తండ్రియగు వరుస బైలుపరచినాడు పొరుగు
వారు సోదరులన్న – మరొకవరుస – తేల్చినాడు మరియు దేవున్
పొరుగు వారిన్ – సరిగ ప్రేమించు మన్నాడు = కొరతలేకుండ
సర్వాజ్ఞల్ నెరవేర్చి మాదిరి జూపిన
|| యేసుక్రీస్తు ||

వాక్కు వినవచ్చినవారలకు – వాక్యహారమున్ తినిపించె ఆకలితో
నున్న ఆయైదువేలన్ గనికరించె – మూకకు వండని రొట్టెలను
బుట్టించి తృప్తిగా వడ్డించె = లోకమంతకు పోషకుడు తా-నే కదా
యని మెప్పుగాంచిన
|| యేసుక్రీస్తు ||

దురితములను తత్ఫలములను – దుష్టుడౌ సైతానును గెల్చె తరుణ
మందు మృతులన్ లేపె – దయ్యములను దరిమివైచె నరుల
భారమున్ వహియించి – మరణమొంది తిరిగిలేచె = తిరుగవచ్చెద
నంచు మోక్ష -పురము వెళ్ళి గూర్చున్న
|| యేసుక్రీస్తు ||

పాపులకు రోగులకు బీద – వారికి దేవుండుయేసె ఆపదలన్నిటిలో
నిత్య – మడ్డుపడు మిత్రుండు క్రీ స్తే – పాపమున పడకుండగా
పాడెడు శిల యేసుక్రీస్తే – పాపులాశ్రయించిన యెడల – పర
లోకమునకు గొంపోవు
|| యేసుక్రీస్తు ||

మరల యూదుల్ దేశమునకు – మళ్ళుచున్నారిదియొక గుర్తు
పరుగులెత్తుచున్నవి కారుల్ – బస్సులు ఇది మరియొకగుర్తు – కరు
వురు మతవాదాలు భూ – కంపముల్ యుద్ధా లొకగుర్తు =
గురుతులై పోయినవిగనుక – త్వరగవచ్చుచున్న శ్రీ
|| యేసుక్రీస్తు ||

Yesu Kristhu Vaari Kada Song Lyrics English

yaesukreestu vaari kathavinuDi – daeSeeyulaaraa – yaesu
kreestuvaari kathavinuDi = dOsakaarulan^ rakshiMpa –
dOsamulaMTani reetigane daasuni roopaMbutO mana – dharaNilO velasina daevuMDau
|| yaesukreestu ||

rOgulan^ koMdarinijoochi – baaguchaeyunani yanalaedu –
rOgamula teeradi parikiMchi – baaguchaeya laenanalaedu –
rOgamula nivaaraNakaina – yOgamul^ taajeppalaedu –
yOgayOgulamiMchu vaidya – yOgi taanani Rjuvugonna
|| yaesukreestu ||

paapulanu niMdiMchi yaevidha – Saapavaakkul^
palkalaedu – paapulaku gatilaedani cheppi – paaradrOli
vaeyalaedu kOpapaDuchu paapulanu raa – kooDadani
vachiyiMpalaedu = paapamulu parihaaramu chaesi –
paramadaevuDu taanani telpina
|| yaesukreestu ||

narulaku daevuDu taMDriyagu varusa bailuparachinaaDu
porugu vaaru sOdarulanna – marokavarusa – taelchinaaDu
mariyu daevun^ porugu vaarin^ – sariga praemiMchu
mannaaDu = koratalaekuMDa sarvaaj~nal^ neravaerchi maadiri joopina
|| yaesukreestu ||

vaakku vinavachchinavaaralaku – vaakyahaaramun^
tinipiMche aakalitO nunna aayaiduvaelan^ ganikariMche –
mookaku vaMDani roTTelanu buTTiMchi tRptigaa vaDDiMche =
lOkamaMtaku pOshakuDu taa-nae kadaa yani meppugaaMchina
|| yaesukreestu ||

duritamulanu tatphalamulanu – dushTuDau saitaanunu
gelche taruNa maMdu mRtulan^ laepe – dayyamulanu
darimivaiche narula bhaaramun^ vahiyiMchi – maraNamoMdi
tirigilaeche = tirugavachcheda naMchu mOksha -puramu
veLLi goorchunna
|| yaesukreestu ||

paapulaku rOgulaku beeda – vaariki daevuMDuyaese
aapadalanniTilO nitya – maDDupaDu mitruMDu kree stae –
paapamuna paDakuMDagaa paaDeDu Sila yaesukreestae –
paapulaaSrayiMchina yeDala – para lOkamunaku goMpOvu
|| yaesukreestu ||

marala yoodul^ daeSamunaku – maLLuchunnaaridiyoka gurtu
parugulettuchunnavi kaarul^ – bassulu idi
mariyokagurtu – karu vuru matavaadaalu bhoo – kaMpamul^
yuddhaa lokagurtu = gurutulai pOyinaviganuka –
tvaragavachchuchunna Sree
|| yaesukreestu ||

Youtube Video

More Songs

దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Bible Mission Songs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top