యేసునామస్మరణ చేయండి | Yesu naama smarana Song Lyrics | Bible mission songs | Telugu christian song| Bible Mission
Table of Contents
Yesu naama smarana Song Lyrics
యేసునామ స్మరణ చేయండి – ప్రియులారా క్రీస్తు-
యేసు నామ స్మరణ చేయండి
యేసునామస్ మరణ వలన – ఎట్టి కష్టమైన తొలగును
యేసునామ స్మరణ వలన – ఎట్టి సౌఖ్యమైన కలుగును
యేసునామ స్మరణ వలన – ఏదిపోదు? ఏది రాదు?
|| యేసు ||
యేసునామ స్మరణ మానకుడి
ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
యేసునామ స్మరణ వలన – ఎట్టి పాపమైన పోవును
యేసునామ స్మరణ వలన – ఎట్టి వ్యాధియైన కుదురును
యేసునామ స్మరణ వలన – ఎట్టి కొదువయైన గడచును
యేసునామ స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు
యేసునామ స్మరణ వలన – ఎట్టి భూతమైన వదలును
|| యేసు ||
క్రీస్తునామ స్మరణ చేయండి –
ప్రియులారా యేసుక్రీస్తు నామస్మరణ చేయండి
క్రీస్తునామ స్మరణ వలన – వాస్తవంబు బైలుపడును
క్రీస్తునామ స్మరణ వలన – స్వస్థి స్థితులు దొరుకుచుండును
క్రీస్తునామ స్మరణ వలన – సుస్థిరంబగు భక్తియబ్బును
క్రీస్తునామ స్మరణ వలన – అస్థి పరము నందు నుండును
క్రీస్తునామ స్మరణ వలన – క్రియకు అన్నియు లభ్యమగును
|| యేసు ||
యేసుక్రీస్తు స్మరణ మానకుడి – ప్రియులారా
క్రీస్తు – యేసునామ స్మరణ మానకుడి
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టిదుఃఖమైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టిచింతయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఏ నిరాశయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టి అజ్ఞానమును ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టి భీతియైన ఉండదు
|| యేసు ||
Pingback: Yesu Nee Thalape Naaku Entho Hayi Song | Bible Mission Songs | Letest Telugu Christian Songs - Ambassador Of Christ