క్షేమా క్షేత్రమా – నడిపించే మిత్రమా | Viswavikyathuda Song Lyrics | Kshema Kshethrama Song Lyrics | 2025 New Year Song | Krupa Ministries
Table of Contents
Kshema Kshethrama Song Lyrics
క్షేమా క్షేత్రమా – నడిపించే మిత్రమా
విడిపోని బంధమా – తోడున్న స్నేహమా (2)
మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా
నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా (2)
|| క్షేమా క్షేత్రమా ||
విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా
నా నిత్యారాధన నీకే యేసయ్యా (2)
సదా నిలుచు నీ ఆలోచనలు
మారిపోవు నీ సంకల్పములు
స్థిరమైనవి నీ కార్యములు
సుస్థిరతను కలిగించును (2)
నీ బసలో భాగస్వామిగా నను చేర్చి
సదా నడిపించుము నీ సంకల్పముతో (2)
|| విశ్వవిఖ్యాతుడా ||
అనుదినము నీ వాత్సల్యమే
నీతో అనుబంధమే పెంచెను
నీదయ నా ఆయుష్కాలమై
కృపా క్షేమము కలిగించెను (2)
కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే
సదా నడిపించుము నీ సేవలో (2)
|| విశ్వవిఖ్యాతుడా ||
నడిపించుము నా కాపరివై
ఈ ఆత్మీయ యాత్రలో
తొట్రిల్లనీయక నను నీవు
స్థిరచిత్తము కలిగించుము (2)
ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై
సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో (2)
|| విశ్వవిఖ్యాతుడా ||