నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం | Nerpinchumu Dheva Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries
Table of Contents
Nerpinchumu Dheva Song Lyrics
పల్లవి:
నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం
నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో
కుడి ఎడమలు నన్ను తొలగనీయక
లోక మాలిన్యమే అంటనీయక
అ.పల్లవి:
నా గమ్యము నీవే యేసయ్యా
నిన్ను చేరాలని నాలో ఆశయ్యా
1) అంతుచిక్కని ఈ అరణ్య మార్గములో
దైవరహస్యములు వినిపించుము
అల్లరిమూకల సమూహము నన్ను తరిమినను
నిర్మలమైన హృదయముతో నీతో నడుపుము
2) కలతలు నన్ను కలవర పెట్టినను
ఆత్మీయత నాలో చెదరనీయకుము
ఆవేదనలు నాలో నిండియున్నను
ఆనందము నాలో విడిపోనియకుము
3) విజయ ఘనతలో ఉప్పొంగనీయక
దీన మనసుతో ఒదుగుట నేర్పుము
శిల లాంటి నాలో నీ జీవము నింపి
నీ ఆశయాలు నాలో నెరవేర్చుమయా
నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం
నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో
కుడి ఎడమలు నన్ను తొలగనీయక
లోక మాలిన్యమే అంటనీయక