చేసికొనరాదు – అపార్ధము చేసికొనరాదు || Chesikonaraadhu Apaardhamu Song Lyrics || Ft. DevaDas Mungamuri || Bible Mission || Old Christian Songs
Chesikonaraadhu Apaardhamu Song Lyrics
చేసికొనరాదు – అపార్ధము చేసికొనరాదు-
దేవుని నపార్ధము చేసికొనరాదు –
పరిశుద్ధుని నపార్ధము చేసికొనరాదు
|| చేసికొన ||
పరమదేవుడే ప్రేమం – పరమ న్యాయసంధానం-
గురుతర శక్తి విధానం – నిరుపమాన సుజ్ఞానం –
వరగుణ ధీరోధారీ స్థా – వరగుణ ధీరోధారి గాన
|| చేసికొన ||
సర్వవ్యాపకత్వుండు – నిర్వికార దేవుండు –
నిర్వచన సజీవుండు సర్వత్ర స్వతంత్రుం డు –
సర్వ సులక్షణధారి – శ్రీ – సర్వ సులక్షణ ధారి గాన
|| చేసికొన ||
నిత్యమౌ మహాత్యంబు – అత్యధిక ప్రభావంబు –
ప్రత్యక్ష పరాక్రమంబు – సత్యమైన తేజంబు –
నిత్యసులక్షణధారి – ఔ – నిత్య సులక్షణధారి గాన
|| చేసికొన ||
దైవ ప్రేమ కొనియాడ – దైవ న్యాయమును బాడ –
దైవ శక్తి గొని వేడ – దైవ జ్ఞాన మొనగూడ –
జీవ సులక్షణధారి – సజీవ సులక్షణధారి గాన
|| చేసికొన ||
కష్టమువచ్చినగాని – నష్టమువచ్చినగాని –
ఇష్టములేకపోనీ భ్రష్టుడవైనను గాని –
స్రష్టననుట మేల – నీదృష్టి కిదియన వీల గాన
|| చేసికొన ||
ప్రార్ధనాలకించినను – ప్రార్ధన వినకుండినను –
వ్యర్ధంబై పోయినను అర్ధముగాకుండినను –
సార్ధక పరచుముగాని అ – పార్ధముచేయుట హాని గాన
|| చేసికొన ||
ఇబ్బందులు రోగములు – సిబ్బందివలె శ్రమలు –
అబ్బో భూకంపములు – మబ్బువంటి దురితములు –
తబ్బిబ్బుచేసిన కాని – హా తప్పు తలంచుట హాని గాన
|| చేసికొన ||
ఆకాశంబులన్ని లోకానందము లన్ని –
నీకై యిచ్చిన వన్ని – ప్రాకటముగ పోదన్ని –
నాకేమి యిదెనటంచు నీ కేకలు మాని తలంచు గాన
|| చేసికొన ||
Song Credits
Youtube Video
https://youtu.be/uXzuEYzAX5I?si=FqeXIwBNE4-TyLsS
Pingback: Deva Memu Nammadagina Song Lyrics | Bible Mission Songs | DevaDas Ayyagaru | Andhra Kraistava keerthanalu | Telugu Kraistava Keerthanalu - Ambassador Of Christ
Pingback: Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs - Ambassador Of Christ
Pingback: Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear - Ambassador Of Christ